Header Banner

పీవీ సునీల్ కుమార్ బిగ్ షాక్.. సస్పెన్షన్ను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!

  Mon Apr 28, 2025 14:10        Politics

సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ సస్పెన్షన్ను మరో 4 నెలల పాటు పొడిగించారు. 2025 ఆగస్టు 28 వరకు సస్పెన్షన్ను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రివ్యూ కమిటీ సిఫార్సుల మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. అఖిల భారత సర్వీసు నిబంధనల ఉల్లంఘన అభియోగంపై సునీల్కుమార్పై వేటు పడింది. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. వైకాపా హయాంలో సీఐడీ విభాగాధిపతిగా పనిచేసి వివాదాస్పదుడిగా ముద్రపడ్డ సునీల్ కుమార్.. జగన్ జమానాలో ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోకుండా తరచూ విదేశాల్లో పర్యటించారు.

 

ఇది కూడా చదవండి: పిన్నెల్లికి బిగ్ షాక్.. మాచర్ల మున్సిపాలిటీని కైవసం చేసుకున్న టీడీపీ!

 

ఒకటి, రెండు సందర్భాల్లో అనుమతి పొందినా, ఆ దేశాలకు కాకుండా వేరే దేశాలకు వెళ్లారు. అమలాపురానికో, భీమవరానికో వెళ్లొచ్చినంత తరచుగా దుబాన్కి రాకపోకలు సాగించారు. ఇవన్నీ అనుమతి లేని పర్యటనలే. జార్జియా వెళ్లేందుకు అనుమతి తీసుకొని... నేరుగా యూఏఈలో వాలిపోయేవారు. అమెరికా వెళ్లేందుకు అనుమతి పొంది యూకేలో పర్యటించారు. 2019 డిసెంబరు నుంచి 2024 మార్చి మధ్య మొత్తం ఆరుసార్లు పీవీ సునీల్ కుమార్ ఇలా విదేశాల్లో పర్యటించినట్లు కూటమి ప్రభుత్వ విచారణలో తేలింది. దీంతో ఆయన్ను సస్పెండ్ చేస్తూ సీఎస్ కె. విజయానంద్ ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు. తాజాగా సోమవారం సస్పెన్షన్ను పొడిగించారు.

 

ఇది కూడా చదవండి: శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.8 లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

 

ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..

 

మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!

 

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #YCP #AndhraPradesh #APpolitics #APNews #EC